»Try These Herbal Tea To Make Body Cool In Summer Season
Tea : ఎండాకాలంలో ఏ రకం టీలు మంచివో తెలుసా ?
బ్లాక్ టీ, కాఫీ, మిల్క్ లను ఎండాకాలంలో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని మూలికా టీలు కూలింగ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.
Tea : కాలంతో సంబంధం లేకుండా చాలామంది టీ(Tea)లను రోజుకు ఎక్కువగా తాగేస్తుంటారు. అతిగా టీలను తాగడం కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అది వేసవి(Summer)లో మండుతున్న ఎండల వల్ల మనలో చాలా మందికి చెమట(Swet)లు ఎక్కువగా పడుతుంటాయి. వేడి కారణంగా కొంతమంది జీర్ణ ప్రక్రియ(digestive process) కూడా ప్రభావితం అవుతుంది. అయితే మిల్క్ టీ లేదా బ్లాక్ టీ(Black Tea) ను ఈ సీజన్లో తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎండ కారణంగా శరీరానికి ఎక్కువ చెమట పట్టిస్తాయి. అలా అని బాడీని చల్లగా ఉంచడానికి ఐస్ క్రీం(Ice Cream) లేదా కూల్ డ్రింక్స్(Cool drinks) ను కూడా అతిగా తాగకూడదు. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిపుణుల ప్రకారం.. కొన్ని హెర్బల్ టీలు మన శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు.. ఆరోగ్యంగా కూడా ఉంచుతాయట అవేంటో తెలుసుకుందాం.
రోజ్ టీ(Rose Tea)
రోజ్ టీ సమతుల్యత, శీతలీకరణ, ఓదార్పు ప్రభావాలను కలిగి ఉంటుంది. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్(Chinese medicine) లో కూడా రోజ్ టీని ఉపయోగిస్తారు. ఈ విషయం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆయుర్వేద రీసెర్చ్ లో పేర్కొన్నారు.
ఫెన్నెల్ టీ(సోంపు టీ)(Fennel tea)
శరీర వేడిని తగ్గించడానికి సోంపు సహాయపడుతుంది. దీనిలో శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. ఇలాంటి సోంపు ఎండాకాలంలో మనకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి(Vitamin C) కూడా పుష్కలంగా ఉంటుంది.ఇది వేడి కారణంగా శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది జీవక్రియను ఉత్తేజితం చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ(digestive system)కు కూడా ఉపయోగపడుతుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ పేర్కొంది.
లెమన్ గ్రాస్ టీ(Lemon grass tea)
నిమ్మగడ్డిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని తేమగా, ఆక్సిజనేట్(Oxygenate) చేస్తుంది. ఇది శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది కూడా. అలాగే ఎండాకాలంలో రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగితే కడుపునొప్పి, కడుపు తిమ్మిరి, జీర్ణ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ధ్రువీకరించింది.
మందారం టీ(Hibiscus tea)
మందారలో ఆంథోసైనిన్ యాంటీఆక్సిడెంట్లు(Anthocyanins are antioxidants), విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఘాటైన రుచి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను హైడ్రేట్(Hydrate) చేస్తుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా ఈ మందారం టీ తగ్గిస్తుంది. ఈ టీ మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అడ్డంకులను తొలగిస్తుంది. ఇది సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. జీవక్రియను సక్రియం చేస్తుంది. ఇది బ్లడ్ లిపిడ్స్(Blood lipids) ను మెరుగుపరిచి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విషయాన్ని జర్నల్ ఆఫ్ ఫైటోథెరపీ రీసెర్చ్ వెల్లడించింది.
పుదీనా టీ(Mint tea)
పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది నోట్లో ఫ్రెష్ నెస్ ను, చల్లదనాన్ని కలిగిస్తుది. వాతావరణంలోని మార్పుల వల్ల ముక్కు మూసుకుపోతుంది. అయితే పుదీనా టీ ముక్కును తెరుస్తుంది. పుదీనా జీర్ణవ్యవస్థ సమస్యలను, విరేచనాలు, మలబద్ధకం వంటి జీర్ణశయాంతర లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా టీ వాంతులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పుదీనా నోటి దుర్వాసను పోగొట్టడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.