SDPT: చేర్యాల పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందించే వైద్య సేవలను,సామాజిక ఆరోగ్య కేంద్రం లోపల అన్ని గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ఓపి చూశారని మెడికల్ ఆఫీసర్‌ను ఆరా తీశారు. సిబ్బంది సమయవేళలు పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. రోగులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలన సూచించారు.