HYD: తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాగంటి సునీతను అవమానించిన తుమ్మల, పొన్నం ప్రభాకర్లు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల స్పందనతో సునీత కన్నీళ్లు పెట్టుకున్నారని, ఆడబిడ్డను అవమానించే భాష వాడటం మానవత్వానికి విరుద్ధమని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.