BDK: ఆయిల్ పామ్ రైతులకు మేలు చేసే GO 594ను రద్దు చేయాలని ప్రైవేట్ కంపెనీలు దాఖలు చేసిన WP 3736/2026 కేసును హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని అడ్వకేట్ జనరల్‌ను రంగంలోకి దించడంతో ప్రభుత్వానికి విజయం లభించింది. రైతులకు అధిక ధరలు కల్పించే జీవోను కాపాడటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.