అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ పేరుతో పోలీసులు ఇవాళ రాయచోటి, మదనపల్లె (అంగళ్ళు) ప్రాంతాల్లో భారీ ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. 10 ప్రత్యేక బృందాలు అధునాతన డ్రోన్ కెమెరాల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాలు, ఖాళీ భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.