MDK: తూప్రాన్ మండలంలో ఎన్నికైన వార్డు సభ్యులకు ఈ నెల 9 నుంచి 13 వరకు ఐదు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సతీష్ తెలిపారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామపంచాయతీలో 114 మంది వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారని వివరించారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.