TPT: తిరుమల జపాలి పైభాగంలో ఆదివారం అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి గంధం చెట్లు నరుకుతూ కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. రూ. లక్ష విలువైవ 32 కేజీల బరువు కలిగిన గంధం దుంగలతో పాటు చంద్రగిరి మండలం పాండురంగవారి పల్లికి చెందిన జె.రాజశేఖర్‌ను పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు అటవీశాఖ అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.