MS Dhoni Issues Mic Drop Statement To Danny Morrison's 'swansong' Comment
MS Dhoni IPL Retirement:ఎంఎస్ ధోని (MS Dhoni).. టీమిండియా మాజీ కెప్టెన్, కీపర్ కూడా.. ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నాడు. జట్టును చక్కగా లీడ్ చేస్తున్నాడు. అతని వయస్సు 40 సంవత్సరాలు.. దీంతో ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రశ్న వస్తోంది. సోషల్ మీడియాలో చాలా పోస్టులు వస్తున్నాయి. ఇటీవల జరిగిన గుజరాత్- చెన్నై మ్యాచ్కు ముందు కామెంటేటర్ డాని మారిషన్ (Danny Morrison) ప్రశ్న వేశాడు.
ఇదే మీ చివరి ఐపీఎలా..? అని అడిగాడు. అందుకు ధోని (MS Dhoni) నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. తన రిటైర్మెంట్ను మీరే డిసైడ్ చేస్తారా అని అడిగాడు. మారిషన్ కూడా నవ్వుతూనే ఓకే అన్నాడు. అంటే ధోని ఇప్పట్లో ఐపీఎల్ నుంచి రిటైర్ కారని తెలుస్తోంది. మరో ఏడాది.. లేదంటే రెండేళ్లు ఐపీఎల్ ఆడతారు.
‘వండర్ ఫుల్ టూర్ అని.. ఇదీ మీ లాస్ట్ సీజనా అని మారిషన్ అడిగారు. హౌ ఆర్ యూ.. ఎంజాయ్ చేస్తున్నారా..? అని కొశ్చన్ చేశారు. వెల్ యు హవ్ డిసైడెడ్ ఇట్స్ మై లాట్స్ సీజన్’ అని ధోని చెప్పారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ధోని (MS Dhoni) ఇప్పుడే రిటైర్ కారని చెన్నై అభిమానులు అంటున్నారు.