PLD: విజయవాడలో శుక్రవారం రాత్రి జరిగిన ఎమ్మెల్యేల సాంస్కృతిక ప్రదర్శనల్లో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రలో ఆయన చేసిన ఏకపాత్రాభినయం సభికులను మంత్రముగ్ధులను చేసింది. ఆయన గాంభీర్యం, డైలాగ్ డెలివరీకి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపించారు.