నాగ చైతన్య.. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. సినిమాల కన్నా రిలేషన్ షిప్స్ వార్తలు అవుతున్నాయి. శోభితతో కలిసి తిరుగుతూ దొరికిపోయాడు. ఇప్పుడు తన క్రష్ మాత్రం మార్గట్ రాబీ అంటున్నాడు.
Chaitu Crush:అక్కినేని నాగ చైతన్య (Chaitanya).. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్లో హిట్స్ కొన్నే.. పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ హాట్ టాపికే. సమంత (samantha) ప్రేమ, పెళ్లి నుంచి విడిపోయే వరకు న్యూస్.. ఇప్పుడు విడిపోయిన ఇద్దరు వార్తల్లో ఉంటారు. నటి శోభిత ధూళిపాళ్లతో (shobita) చైతు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. వీటిని ఇద్దరూ ఖండించారు. తన క్రష్ ఎవరో చైతన్య చెప్పారు.
చైతు (Chaitanya) నటించిన కొత్త మూవీ.. కస్టడీ (custody). ఈ నెల 12వ తేదీన మూవీ రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో టీమ్ పాల్గొంది. ఈ క్రమంలో చైతన్యను క్రష్ ఎవరని అడగగా చెప్పేశారు. ఇటీవల తాను ‘బాబీలోన్’ అనే ఇంగ్లీష్ సినిమా చూశానని చైతన్య చెప్పారు. అందులో నటించిన మార్గట్ రాబీ (Margot Robbie) ఫెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యానని వివరించారు. ప్రస్తుతం ఆమె అంటే చాలా ఇష్టం ఉందన్నారు.
ఆ ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేయగా.. కింద శోభిత (shobita) పేరు రాస్తున్నారు. వారిద్దరూ కలిసి తిరగడంతో అలా పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల లండన్‌లో (london) కూడా కలిసి కనిపించారు. చైతు మాత్రం తెలివిగా మార్గట్ రాబీ (Margot Robbie) అని తప్పించుకున్నాడు. ఎందుకంటే ఆమెను ఎలాగూ అడగరనే ధైర్యంతో అలా చెప్పి ఉంటారని కొందరు అంటున్నారు.
మార్గట్ రాబీ (Margot Robbie) ఇండియా రారని.. అందుకే చైతు (chaitu) ఆమె పేరు చెప్పారని చెబుతున్నారు. చైతు మనసులో మాత్రం ఇప్పుడు శోభిత (shobita) ఉన్నారని.. అందుకే వారు కలిసి కనిపిస్తున్నారని మరికొందరి వెర్షన్. ఇప్పటికైతే చైతన్య సింగిలే.. భవిష్యత్‌లో శోభితను (shobita) జీవితంలోకి ఆహ్వానిస్తారో లేదో చూడాలీ.