GDWL: జిల్లాలో నమోదైన రెండు సైబర్ నేరాల కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ. 1,75,244 రికవరీ చేసి వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. కోర్టు ఆదేశాలు, పోలీస్ బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో ఆ మొత్తాన్ని తిరిగి సాధించడం బాధితులకు పెద్ద ఊరటనిచ్చిందన్నారు. రికవరీలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు.