VSP: గంభీరం పంచాయతీ యాతపేటలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. తాటి చెట్టు ఎక్కి కళ్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు తెగి గండిబోయిన నర్సింగ్‌రావు (43) కిందపడి మృతి చెందారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని గ్రామస్తులు తెలిపారు.