BHPL: రేగొండ(M) రంగయ్యపల్లి సర్పంచ్ మోహన్ రావు తన ఉదారతతో మూగ క్రికెటర్ పసుల రాజుకు అండగా నిలిచారు. వైకల్యాన్ని అధిగమించి క్రికెట్లో అద్భుత ప్రతిభ చూపుతున్న పసుల రాజు ఇటీవల జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయనకు కిట్ కొనుగోలు, ప్రయాణ ఖర్చులకు ఇబ్బంది ఎదురవుతున్న విషయం తెలిసి సర్పంచ్ రూ.4,000 ఆర్థిక సాయం అందజేశారు.