భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ మరోసారి నంబర్ 1గా నిలిచారు. ఆయన 105 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆయన తర్వాత స్థానంలో 92 బిలియన్ల డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ నిలిచారు.