ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు అదరగొట్టింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. 144/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్.. 171 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 12.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.