T20 WC ఫైనల్ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా నిలిచిపోతే, రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే, రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అయితే, ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. కాగా, అహ్మదాబాద్ వేదికగా ఈనెల 8న భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే తుది పోరులో వర్షం పడే అవకాశమే లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.