SRCL: రంజాన్ మాసం సందర్భంగా వేములవాడ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.