ASF: రెబ్బెన మండలం ఇందిరానగర్ శ్రీ కనకదుర్గాదేవి మహంకాళి జాతర వాల్ పోస్టర్లను కలెక్టర్ హరిత శుక్రవారం ఆవిష్కరించారు. ఆలయ అర్చకుడు దేవర వినోద్ కలెక్టర్‌ను కలిసి జాతరకు ఆహ్వానించారు. ఏప్రిల్ 2న శివపార్వతుల కళ్యాణం, 3న మహంకాళి జాతర, బోనాలు, రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.