NLG: నేను విద్యనభ్యసించిన పలివెల పాఠశాలకే ఎమ్మెల్సీ హోదాలో రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పలివెల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య హాజరై మాట్లాడారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు అందరూ ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు.