కోనసీమ: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక ఫైరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా SP రాహుల్ మీనా శుక్రవారం పెద్దాపురం వద్దనున్న జిల్లా ఫైరింగ్ రేంజ్లో ఘనంగా ప్రారంభించారు. SP స్వయంగా SLR, AK 47, పిస్టల్‌తో లక్ష్యాన్ని ఛేదించి ఫైరింగ్ శిక్షణను మొదలుపెట్టారు. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ అనుభవం ఎంతో దోహదపడుతుందన్నారు.