KMM: ఖమ్మం జడ్పీ సెంటర్లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాలను నిన్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి, అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థిని భవాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిన్నారిని ఆశీర్వదించారు.