ASF: పెంచికల్ పేట్ రేంజ్ పరిధిలో అడవి జంతువులను వేటాడిన ముగ్గురిని పట్టుకున్నట్లు FRO అనిల్ తెలిపారు. సమాచారం మేరకు ఎల్లూరుకు చెందిన అప్పాజీ శ్రీనివాస్ ఇంట్లో ఈనెల 5న DRO ఆస్మా సిబ్బందితో కలిసి సోదాలు చేయగా అడవి పంది మాంసం లభించిందన్నారు. ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ముగ్గురిపై కేసు నమోదు చేసి సిర్పూర్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.