PLD: వినుకొండ పట్టణ సీఐగా ప్రభాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న శోభన్ బాబు ఒంగోలు పీటీసీకి బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో వినుకొండ రూరల్ సీఐగా పనిచేస్తున్న ప్రభాకర్‌ను పట్టణ సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.