ADB: గాదిగూడ మండలం కునికష గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ ప్రమీలకు పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు స్పందించిన సిబ్బంది గర్భిణీ మహిళను 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు EMT రాజా తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పైలట్ సచిన్ పేర్కొన్నారు.