AP: మాజీ సీఎం జగన్పై మంత్రి లోకేష్ విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని కుట్ర పన్ని వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని అన్నారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని తెలిపారు. దోషులెవరూ తప్పించుకోలేరని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వ పాలనలో జగన్ ఆటలు సాగవని హెచ్చరించారు.