»Gauhati High Court Declares Arunachal Mlas Election Void For Concealing Info
BJPకి భారీ షాక్.. ఆస్తుల వివరాలు వెల్లడించని ఎమ్మెల్యే సస్పెండ్
ఆమె తన భర్త పేరిట ముంబై, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేదని దసాంగ్లు తన ఫిర్యాదులో న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేసింది.
ఒక ప్రజాప్రతినిధి కావాలంటే అన్ని వివరాలు సమర్పించుకోవాల్సిందే. వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ, వ్యాపార, నేర చరిత్ర తదితర అన్ని వివరాలు చెప్పాల్సిందే. ఎన్నికల్లో (Elections) పోటీ చేసేందుకు జీవిత చరిత్ర (Life Story) అంతా ఎన్నికల సంఘం ముందు ఉంచాల్సిందే. లేకుంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా కూడా వేటు (Suspend) పడే అవకాశం ఉంది. తాజాగా అలాంటి సంఘటన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేకు భారీ షాక్ ఇస్తూ గువాహటి హైకోర్టు (Gauhati High Court) తీర్పు వెలువరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆ రాష్ట్రంలోని హయిలియాంగ్ (Hayuliang) స్థానం నుంచి 2019లో బీజేపీ ఎమ్మెల్యేగా దసాంగ్లు పుల్ (45) (Dasanglu Pul) ఎన్నికయ్యారు. ఆమె మాజీ ముఖ్యమంత్రి కలికో పుల్ మూడో భార్య. ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దసాంగ్లు ఆమె ఎన్నికను సవాల్ చేశారు. ఎన్నికల ప్రమాణపత్రంలో సరైన వివరాలు వెల్లడించలేదని గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తన భర్త పేరిట ముంబై, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేదని దసాంగ్లు తన ఫిర్యాదులో న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేసింది. వాద ప్రతివాదాల అనంతరం ఇటానగర్ బెంచ్ గురువారం దసాంగ్లు పుల్ ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది.
ఈ తీర్పు (Judgement) ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. తమకు అనుకూల తీర్పు రావడంతో కాంగ్రెస్ (Congress) అభ్యర్థి దసాంగ్లు (Dasanglu) హర్షం వ్యక్తం చేశారు. ఆమె అనుచరులు, కాంగ్రెస్ అభ్యర్థులు న్యాయం గెలిచింది అని పేర్కొన్నారు. కాగా తన ఎన్నిక చెల్లదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే దసాంగ్లు పుల్ సవాల్ చేయనున్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు. ‘కాంగ్రెస్ అభ్యర్థి చెబుతున్న ఆస్తులు నా భర్త మొదటి భార్యకు చెందినవి. అందుకే వాటి వివరాలను నా ఎన్నికల ప్రమాణపత్రంలో చేర్చలేదు’ అని సస్పెండ్ కు గురైన బీజేపీ ఎమ్మెల్యే దసాంగ్లు పుల్ తెలిపారు.