»Garla Zptc Member Jatoth Jhansi Laxmi Resigns To Brs Party
ఆవిర్భావ దినోత్సవం రోజే BRS Partyకి షాక్.. కీలక సభ్యురాలు రాజీనామా
మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ తో బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలుగాలని నిర్ణయించుకున్నా. వీటన్నిటి నేపథ్యంలో తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఝాన్సీలక్ష్మి ప్రకటించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (Khammam District) బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితులు కొంత ఆందోళనకరంగా మారుతున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని (Ponguleti Srinivas Reddy) బహిష్కరించడంతో పార్టీలో కొంత గందరగోళం నెలకొంది. ఉద్యమ పార్టీ నుంచి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ (BRS Party)కు ఆవిర్భావ దినోత్సవం రోజే భారీ షాక్ తగిలింది. మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) గార్ల జెడ్పీటీసీ సభ్యురాలు (ZPTC) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె రాజీనామా ప్రకటన చేశారు.
గార్ల (Garla) జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి జాటోత్ ఝాన్సీలక్ష్మి (Jatoth Jhansi Laxmi) బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. గార్ల మండలంపై మంచి పట్టున్న ఆమె రాజీనామా చేయడంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మండల కేంద్రం గార్లలోని పొంగులేటి, కోరం కనయ్య క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేయడంతో నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలుగాలని నిర్ణయించుకున్నా. ఇక జెడ్పీ చైర్మన్ కనకయ్యకు ప్రభుత్వం భద్రతను తొలగించడం కక్షపూరితమని పేర్కొన్నారు. వీటన్నిటి నేపథ్యంలో తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఝాన్సీలక్ష్మి ప్రకటించారు. తనతోపాటు మరో 30 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా (Resign) చేసినట్లు తెలిపారు.