»Once Again Water Leakage In Yadagiri Laxmi Narasimha Swamy Temple
Yadadri ఆలయంలో మళ్లీ లీకేజీలు.. గోడల వెంట కారుతున్న Rain Water
గతంలో చాలా సార్లు లీకేజ్ లు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మరమ్మతులు చేశారు. కానీ మళ్లీ అక్కడే లీకేజ్ లు ఏర్పడడం గమనార్హం. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో జరిగిన చోట మళ్లీ ఇలాంటి లోపాలు బయటపడడంతో భక్తులు అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (Yadadri Laxmi Narasimha Swamy Temple) మరోసారి లీకేజీలు (Leakages) ఏర్పడ్డాయి. భారీ వర్షానికి ఆలయంలో నీళ్లు నిలిచి ఆలయంలోకి వచ్చేశాయి. ఆలయ ఆవరణలో (Temple Premises) ఈ లీకేజీలు ఏర్పడడం మరోసారి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయంలో పనులు అసంపూర్తిగా జరిగాయని వస్తున్న ఆరోపణలకు ఈ లీకేజీలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
యాదాద్రి భువనగరి జిల్లాలో (Yadadri Bhuvanagiri District) కొన్ని రోజులుగా అకాల వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి (Heavy Rain) ఆలయం స్లాబ్ పైన నీళ్లు నిలిచాయి. అష్టభుజి ప్రాకార మండపం, బ్రహ్మోత్సవ మండపం, వేంచేపు మండపం, ప్రధానాలయ ముఖ మండపంలోని ఆండాల్ అమ్మవారి ఆలయం వెనుకాల గోడ, ఆంజనేయ స్వామి ఆలయం వెనుక భాగాల్లో గోడ నుంచి నీరు కారుతోంది. వర్షపు నీరు ఆలయ ఆవరణలోకి చేరుతోంది. వెంటనే అధికారులు (Officials) చర్యలు తీసుకున్నారు. నీరు లీకేజ్ కాకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు. సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇక ఆలయ మాడవీధుల్లో కూడా నీరు నిలిచింది.
క్యూ కాంప్లెక్స్ (Que Complex) మూడో అంతస్తులో స్లాబ్ బీమ్ నుంచి వర్షపు నీరు కారుతోంది. కొండపైన ప్రోటోకాల్ కార్యాలయం (Protocol Office) నుంచి ప్రధాన ఆలయానికి వెళ్లే మార్గంలో మట్టి రోడ్డు కోతకు గురైంది. గతంలో చాలా సార్లు లీకేజ్ లు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మరమ్మతులు చేశారు. కానీ మళ్లీ అక్కడే లీకేజ్ లు ఏర్పడడం గమనార్హం. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో జరిగిన చోట మళ్లీ ఇలాంటి లోపాలు బయటపడడంతో భక్తులు అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా ఈ లీకేజ్ లతో వెంటనే పాలనా యంత్రాంగం రంగంలోకి దిగింది. లీకేజ్ లు కాకుండా చర్యలు చేపట్టింది.