W.G: 77 సార్లు రక్తదానం చేసిన జర్నలిస్ట్ బొడ్డు కృష్ణ భగవాన్ నేటి యువతకు గొప్ప ఆదర్శమని ఈఈ కె.మధు కుమార్ కొనియాడారు. నరసాపురం ఈఈ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన, భగవాన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మధు కుమార్ మాట్లాడుతూ.. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడంలో రక్తం ఎంతో విలువైనదని అన్నారు.