WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, మేయర్ సుధారాణి, MLA రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో విస్తృత శుద్ధి, చెత్త సేకరణ చేపట్టారు. అనంతరం ప్రజలతో సమావేశాలు నిర్వహించి పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించారు.