VZM: విజయనగరంలోని అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఇవాళ శ్రీ సుదర్శన నరసింహస్వామి విగ్రహా ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి దేవనాధ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అర్చకులు వేద మంత్రాల నడుమ పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమా దేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.