యాంకర్, నటి అనసూయ ఇటీవల పాల్గొన్న హోలీ సంబరాల్లో ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆమె అసహనం వ్యక్తం చేసింది. ‘ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని సమాజం నిలదీసే రోజు రావాలి. మహిళలపై వివక్ష చూపడం సరికాదు. ఇలాంటివారిని చూసి సమాజం సిగ్గుపడాలి. ఎన్నో ఎదుర్కొని పైకి వచ్చేవారిని విమర్శించడానికి మీరెవరు?’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది.