T20 WC సెమీస్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడని భారత్, ఇంగ్లండ్ కెప్లెన్లు సూర్య, బ్రూక్ కితాబిచ్చారు. చక్కగా బ్యాటింగ్ చేస్తున్న ప్రత్యర్థిని కట్టడి చేయడంలో బుమ్రా రాణించాడని.. ఇతర బౌలర్లూ ఇంగ్లండ్ గెలవకుండా చేశారని సూర్య అన్నాడు. బుమ్రా అత్యుత్తమ బౌలర్ అని బ్రూక్ పేర్కొన్నాడు. ముఖ్యంగా అక్షర్ పట్టిన తన క్యాచ్ తాను చూసినవాటిల్లో బెస్ట్ అని చెప్పాడు.