MHBD: ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల కేంద్రాల్లో ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు గురువారం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అభివృద్ధి ప్రదాతకు రాజ్యసభ ఖరారు చేయడం చాలా ఆనందంగా ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.