TS School Uniform : సర్కారు బడి యూనిఫాం మారింది.. టోటల్ కార్పొరేట్ లుక్
తెలంగాణ సర్కార్(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే సంచలన ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం(Uniform)లో మార్పులు చేసింది. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(Kasturba Gandhi School for Girls)తో పాటు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుకుంటున్న 24,27,391 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా రెండు జతల యూనిఫాంలను సరఫరా చేస్తోంది.
TS School Uniform : తెలంగాణ సర్కార్(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే సంచలన ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం(Uniform)లో మార్పులు చేసింది. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(Kasturba Gandhi School for Girls)తో పాటు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుకుంటున్న 24,27,391 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా రెండు జతల యూనిఫాంలను సరఫరా చేస్తోంది. ఎరుపు(Red) మరియు బూడిద రంగు చొక్కా మరియు మెరూన్-రంగు సూటింగ్‌కు ఒకే విధంగా అంటుకొని ఉండగా, డిపార్ట్మెంట్ యూనిఫామ్‌ల రూపకల్పన మరియు నమూనాను సర్దుబాటు చేసింది. ఇది విద్యార్థులకు కార్పొరేట్ లుక్(Corporate look) అందిస్తుంది. ఫ్యాషన్ డిజైనర్ల సూచనల మేరకు ఈ మార్పులు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలకు కార్పోరెట్ లుక్ తీసుకోచ్చేందుకు సర్కార్ కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే యూనిఫాంను మార్చేందుకు సిద్ధమైంది. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విడివిడిగా డిజైన్ల(designs)ను రూపొందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 24,27,391 మంది విద్యార్థులకు యూనిఫాం కుట్టడం కోసం, డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (TSCO) నుండి 1,26,96,313.30 మీటర్ల యూనిఫాం క్లాత్‌ను కొనుగోలు చేసింది. మండల కేంద్రాలకు చేరిన గుడ్డను కుట్టించేందుకు పాఠశాలలకు అప్పగిస్తున్నారు. ఈసారి జిల్లాల్లో కనీసం 50 శాతం యూనిఫామ్‌లను స్థానిక టైలర్ల ద్వారా కుట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ పనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. మే 31లోగా యూనిఫాం కుట్టడం పూర్తి చేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.