Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..కేటుగాళ్లతో జాగ్రత్త
తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను పోలీసులు గుర్తించారు. సంబంధింత వెబ్సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది.
తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) షాకింగ్ న్యూస్ చెప్పింది. టీటీడీకి నకిలీ వెబ్ సైట్ల బెడద వెంటాడుతోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పేరుతో ఓ నకిలీ వెబ్సైట్(Fake Website) గుట్టు రట్టయ్యింది. భక్తులకు టోకరా ఇస్తున్న ఓ నకిలీ వెబ్సైట్ గురించి తెలియడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ వెబ్ సైట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల(Tirumala) కు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ(TTD) వెబ్ సైట్ సేవలు అందిస్తోంది. శ్రీవారి దర్శన వేళల సమాచారం, ఇతర సేవల గురించి, స్వామివారి పూజా కార్యక్రమాలు, విశిష్టత గురించి ఆ వెబ్ సైట్(Fake Website) ద్వారా భక్తులకు తెలియజేస్తోంది. అయితే తాజాగా భక్తులను మోసం చేస్తున్న ఓ నకిలీ వెబ్ సైట్ (Fake Website)ను పోలీసులు గుర్తించారు.
శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవల పేరుతో ఈ వెబ్ సైట్ (Fake Website) చాలా మంది నుంచి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం టీటీడీ(TTD) స్వామివారి దర్శన, ఆర్జిత సేవలకు సంబంధించిన అన్ని టిక్కెట్లను ఆన్లైన్లోనే విక్రయిస్తూ వస్తోంది. ఇదే అదనుగా చేసుకుని నకిలీ సైట్ల(Fake Website)తో రూపొంచింది కొందరు కేటుగాళ్లు శ్రీవారి భక్తుల సొమ్మును దోచుకుంటున్నారు. ఈ విషయంలో భక్తులకు టీటీడీ(TTD) కీలక సూచనలు చేసింది. నకిలీ వెబ్ సైట్ల(Fake Website) మాయలో పడొద్దని భక్తులకు సూచించింది.