Visakha : సింహాచలం దేవాలయం ప్రతిష్ట మంటగలిపారు : స్వామి స్వరూపానంద స్వామి
సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద (Swaroopananda Swamy) విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
విశాఖ (Visakha) లోని సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామి(Swaroopananda Swamy) ఆగ్రహం వ్యక్తం చేశారు.భక్తుల ఆర్తనాదాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. భక్తుల ఇబ్బంది మధ్య దైవ దర్మనం బాధ కలిగించిందని ఆయన తెలిపారు. భక్తులకు దేవుడిని దూరం చేసేలా అధికారులు వ్యవహరించారని ఆయన ఆరోపించారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానని, దర్మనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు.సింహాచలం చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. అత్యంత దారుణమైన తీరు అధికారులు కనబరిచారంటూ స్వరూపానంద్రస్వామి మండిపడ్డారు. అంతరాలయంలో ప్రతిష్ట దిగాజార్చరు. భక్తుల(Devotees) యొక్క అర్తనాదాలు అధికారులకు తగులుతాయి అంటూ స్వరూపానంద సరస్వతి తీవ్రస్థాయిలో ఆలయంలో ఏర్పాట్లను ఉద్దేశించి అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే చందనోత్సవంలో ఏర్పాట్లపై భక్తులు పైర్ అయినారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రులు కొట్టు సత్యనారాయణ(Minister Kottu Satyanarayana),మంత్రి బొత్స సత్యనారాయణలను ఆలయంలో ఏర్పాట్లపై నిలదీశారు. ఏర్పాట్లు చెయ్యడంలో విఫలం అయ్యారంటూ నిలదీశారు. దీంతో వారు భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకుండా పోయింది. పోలీసుల తీరుపై దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు .సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామి (Lakshminarasimha Swami) నిజరూప దర్శనం, చందనోత్సవంలో వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజు (Ashok gajapati raju) , ఆయన కుటుంబ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. అనువంశధర్మకర్త అశోక్ గజపతిరాజు మొదట పూజ చేశారు. సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామికి డిప్యూటీ సీఎం కొట్టు సత్య నారాయణ, జిల్లా మంత్రి గుడివాడ (Mantri Gudivada) అమర్నాథ్ పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి (Y.V. Subbareddy) తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.