»Loneliness In Life Software Engineers Letter Goes Viral
Sukhada : జీవితంలో ఒంటరితనం..సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేఖ వైరల్..
జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (software engineer) ట్విట్టర్లో రాసిన లేఖ వైరల్ అవుతోంది.
కర్ణాటక బెంగళూర్‌కి (bengaluru) చెందిన 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ (software engineer) ట్విట్టర్ లో రాసిన లేఖ సుఖదా (Sukhada) అనే యూజర్ ద్వారా షేరై నెటిజన్లను ఆలోచింపచేస్తోంది. జీవితం చాలా నిరాశగా ఉందని.. భారంగా నడుస్తోందని అతను లెటర్ లో పంచుకున్నాడు. దాదాపుగా 3 సంవత్సరాలుగా ఒకటే జాబ్‌లో ఉన్నానని.. సంవత్సరానికి 58 లక్షల రూపాయల వరకూ సంపాదన ఉన్నా సంతోషం లేదని అతను లేఖలో తెలిపాడు. తన ఫ్రెండ్స్‌లాగ తన జీవితంలో కూడా గర్ల్ ఫ్రెండ్ లేదని.. తన లైఫ్ సంతృప్తిగా అనిపించట్లేదని తన లేఖలో తెలిపాడు. జీవితం ఆసక్తికరంగా సాగాలంటే సలహా కావాలంటూ.. ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్(Software Engineer) రాసిన లేఖపై నెటిజన్లు పాజిటివ్ (Positive) గా స్పందిస్తున్నారు.
ఇప్పడు ఆ లేఖ వైరల్ అవుతోంది. జీవితం అనుకున్నట్లుగా లేకపోతే చాలామంది డిప్రెస్ అయిపోతున్నారు. అంతటితో జీవితం ముగిసిపోయిందని.. ఇంక ముందుకు సాగలేమని నిరాశ పడుతున్నారు. ఒక్కోసారి డిప్రెషన్(Depression)లోకి వెళ్లిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మనసులో ఉన్న బాధని మనకు నచ్చినవారితో పంచుకోవడం వల్ల ఉపశమనం పొందచ్చు.. లేదంటే కొందరి సలహాలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడొచ్చు.
ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయని .. నీకున్న సంపాదన కూడా చాలామందికి ఇప్పుడు లేదని సంతోషంగా ఉండమని కొందరు.. గర్ల్ ఫ్రెండ్ ఉన్నంత మాత్రనా సంతోషంగా దొరుకుతుందని చెప్పలేమని..నువ్వే కొత్తగా ఏదైనా బిజినెస్ (Business) స్టార్ట్ చేయమని మరికొందరు రకరకాలుగా సలహాలు ఇచ్చారు. ఏది ఏమైనా తనకున్న సమస్యను ట్విట్టర్ వేదికగా బయటపెట్టి తగిన సొల్యూషన్ కోసం ఆ యువకుడు చేసిన పని అభినందనీయమని చెప్పాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. నెటిజన్లు ఇచ్చే సమాధానాల్లో ఏదైనా అతనికి కొత్త మార్గం చూపించవచ్చు. చాలామంది అనుకుంటారు కష్టాలు చెప్పుకుంటే వెక్కిరిస్తారు అని.. కానీ ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విషయంలో ఆది అబద్ధమని రుజువైంది.