Shankarpally : అమిత్‌షా పర్యటన… ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
అమిత్‌షా (Amit Shah) నేటి చేవెళ్ల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. హైదరాబాద్ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే భారీ వాహనాలను టిప్పుకాన్ బ్రిడ్జి వద్ద దారిమళ్లించి, శంకర్పల్లి, పర్వేద ఎక్స్‌రోడ్, ఆలూర్ మీదుగా వికారాబాద్ వైపు అనుమతిస్తారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) హైదరాబాద్ రాక సందర్భంగా సైబరాబాద్ (Cyberabad) పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్ నాయక్ (Commissioner Narayan Naik) ఆదేశాలు జారీచేశారు. నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి చేవెళ్ల, వికారాబాద్ (Vikarabad) వైపు వచ్చే భారీ వాహనాలను టిప్పుకాన్ బ్రిడ్జి వద్ద దారిమళ్లించి, శంకర్పల్లి(Shankarpally) పర్వేద ఎక్స్‌రోడ్, ఆలూర్ మీదుగా వికారాబాద్ వైపు అనుమతిస్తారు.
హైదరాబాద్ నుంచి మోయినాబాద్(Moinabad), చేవెళ్ల మీదుగా వికారాబాద్ వెల్లే వాహనాలను రోటరీ-1 టీఎస్పీఏ వద్ద దారిమళ్లించి, సర్వీసురోడ్డు మీదుగా నర్సింగి, జన్వాడ-శంకర్పల్లి, పర్వేద ఎక్స్‌రోడ్ నుంచి వికారాబాద్ వైపునకు అనుమతిస్తారు. రాజేంద్రనగర్, శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18వైపు వచ్చే వాహనాలను ఒకటవ నెంబర్ ఎగ్జిట్ నుంచి దారిమళ్లించి, సర్వీసు రోడ్డు మీదుగా మూవీ టవర్స్ న్యూ రోడ్, సీబీఐటి జంక్షన్(CBIT Junction), శంకర్పల్లి, పర్వేద ఎక్స్‌రోడ్, ఆలూర్ మీదుగా వికారాబాద్ వైపు అనుమతిస్తారు.పై ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాలను ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని జాయింట్ సీపీ (ట్రాఫిక్) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.