Punjab : 35 రోజుల తర్వత ఎట్టకేలకు చిక్కిన అమృత్‌పాల్ సింగ్
దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు చిక్కాడు.
నెల రోజులకుపైగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టి తప్పించుకుని తిరుగుతున్న ఖలీస్థాన్ (Khalistan) వేర్పాటువాది,‘వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ఎట్టకేలకు చిక్కాడు. పంజాబ్(Punjab)లోని మోగాలో ఆదివారం ఉదయం అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. . అమృతపాల్ సింగ్ గత రాత్రి తన గ్రామమైన జల్లుపూర్ ఖేరా(Khera) చేరుకుని ఉదయం ప్రార్థనలు చేసినట్లు తెలిసింది. అతడి గురించి సమాచారం అందడంతో పోలీసులు (police) గ్రామాన్ని చుట్టుముట్టారు. దీంతో తప్పించుకునే మార్గం లేక పోలీసులకు లొంగిపోయాడు.అనంతరం ఆయనను అసోంలోని దిబ్రూగఢ్ (Dibrugarh) జైలుకు తరలిస్తున్నారు.
ఆయన సంస్థకు చెందిన ఇతర సభ్యులు కూడా అదే జైలులో ఉండడంతో అమృత్‌పాల్‌ను కూడా అక్కడికే తరలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్ (Lovepreet Singh) అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఓ కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విడిపించుకోవాలన్న అమృత్‌పాల్ పిలుపు మేరకు ఫిబ్రవరి 23న యువత అమృత్సర్ (Amritsar) జిల్లాలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. దీంతో యువతను రెచ్చగొట్టారంటూ అమృత్‌పాల్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత అతడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.
అయితే, ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన అమృత్ పాల్ పోలీసులకు సవాలు విసిరాడు. దీంతో అతడు పరారీలో ఉన్నట్టు మార్చిలో పోలీసులు ప్రకటించారు. అలాగే, అతడిపై లుక్ అవుట్ నోటీసు, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు. తాజాగా ఈ తెల్లవారుజామున అమృత్‌పాల్ పోలీసులకు చిక్కాడు.అమృత్‌పాల్ అరెస్ట్‌తో పంజాబ్ (Punjab) పోలీసులు అప్రమత్తమయ్యారు. మోగాతో పాటు అతడి స్వగ్రామం జల్లుపుర్ ఖేరాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఇతను పంజాబ్ లో ఖలిస్థానీ కార్యకలాపాలను సాగించాడు. అల్లర్లు సృష్టించినట్లు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ పై కేసులు పెట్టారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు