»Former Karnataka Cm Kumaraswamy Admitted To Hospital Due To Illness
Bangalore : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
జేడీఎస్ నాయకుడు హెచ్డి కుమారస్వామి (HD Kumaraswamy) స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. జ్వరం, అలసట కారణంగానే కుమారస్వామి నీరసించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
కర్ణాటక (Karnataka) మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలసట కారణంగా బెంగళూరు(Bangalore) లోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. జేడీఎస్ (JDS)పార్టీ అభ్యర్థుల తరపున కుమార స్వామి రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. కొద్దిరోజులగా రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తున్న ఆయన అనారోగ్యం బారినపడ్డాడు. కుమారస్వామి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అయితే, అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు (Doctors) కీలక సూచనలు చేశారు.అలసట, సాధారణ బలహీనత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన కుమార స్వామి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు.
అయితే, రెస్ట్ తీసుకోవాలని మణిపాల్ ఆస్పత్రి (Manipal Hospital) వైద్యులు ఒక ప్రకటనలోవెల్లడించారు. దీంతో కుమారస్వామి ఆదివారం రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు తన ఆరోగ్యం గురించి కలత చెందరాదని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక(Assembly elections)ల కోలాహలం నెలకొంది. అభ్యర్థుల నామినేషన్ల (nominations) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ (JDS) పార్టీలు ప్రచారపర్వంలో వేగాన్ని పెంచాయి. ఆయా పార్టీల ముఖ్యనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడవుతాయి. అన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి.