»Union Minister Kishan Reddy Is Good News For Komuravelli Mallanna Devotees
Kishan Reddy: కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్రం శుభవార్త
కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు. దర్శనానికిి వెళ్లే భక్తుల కోసం రైల్వే హాల్ట్ స్టేషన్ మంజూరు అయిందన్నారు.
Union Minister Kishan Reddy is good news for Komuravelli Mallanna devotees
Kishan Reddy: తెలంగాణలో కొమురవెల్లి మల్లన్నను కొలిచే భక్తు అధికం. ఆయన కళ్యాణం వేడుకకే కాకుండా నిత్యం ఆలయాన్ని వేలమంది దర్శించుకుంటారు. సిద్దిపేటలో ఉన్న ఈ దేవలయానికి ప్రయాణిికులు సౌకర్యార్థం రైల్వే హాల్టింగ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు. కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ కోసం కేంద్రానికి అనేక సార్లు లేఖలు రాశామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖనుంచి అనుమతి వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని శనివారం కిషన్ రెడ్డి మీడియాతో తెలిపారు. త్వరలో కొమురవెల్లి స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో కొత్తగా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని. భక్తులు ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తుండటంతో రైల్వే శాఖ స్పందించిందని అన్నారు. కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణం పనులు వేగంగా చేపడుతామన్నారు. లకుడారం, దుద్దెడ స్టేషన్ల మధ్య కొమురవెల్లిలో కొత్త హాల్ట్ స్టేషన్ నిర్మించనున్నారు.