Fire Accident : బంజరాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో అగ్ని ప్రమాదం
బంజారాహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 4లో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
Huge fire accident in godown Property worth lakhs burnt at Assam Kamrup Metro district
Fire Accident : బంజారాహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 4లో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4 లో సరిత రెసిడెన్సీ వద్ద ఫైర్ ఏక్సిడెంట్ అయిందని డయల్ 100కు సమాచారం వచ్చిందని జూబ్లీహిల్స్ ఫైర్ ఇన్స్ పెక్టర్ సాయి తెలిపారు. వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో, సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కారును డ్రైవర్ స్టార్ట్ చేస్తుండగా స్పార్క్ వచ్చి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పక్కనే పార్క్ చేసి ఉన్న రెండు కార్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఈ ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 3:15 కి కాల్ రావడంతో 10నిమిషాల వ్యవధిలో వచ్చి 15 నిమిషాల పాటు శ్రమించి మంటలు అదుపుచేసినట్లు ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు. పార్కింగ్ ప్లేస్ లో తగలబడ్డ కార్ల ద్వారా మంటలు సరిత రెసిడెన్స్ రెండవ అంతస్తు వరకు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.