NLG: 15వ ఆర్థిక సంఘం ద్వారా చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు రూ. 1,03,75,769 అన్‌టైడ్ నిధులు రెండు విడతలుగా విడుదలయ్యాయి. గ్రామ జనాభా ప్రాతిపదికన ఈ నిధుల కేటాయింపు జరిగింది. అత్యధికంగా వెలిమినేడు జీపీకి రూ. 13,97,267, గుండ్రాంపల్లికి రూ. 9,09,050 జమ కాగా.. అతి తక్కువగా బొంగోని చెరువుకు రూ. 1,44,664, వెంబావికి రూ. 2,44,777 నిధులు వచ్చాయి.