టికెట్ ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ‘OG’ చిత్ర బృందానికి స్వల్ప ఊరట లభించింది. ఈ సినిమా టికెట్ రేట్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ శుక్రవారం వరకు స్టే విధించింది. సంబంధిత మెమోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టి..ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.