KMM: మధిర డివిజన్లో రైతులకు ఆధునిక సాగు కోసం డ్రోన్లను 40% సబ్సిడీతో ఇవ్వనున్నట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర గురువారం తెలిపారు. ఒక్కో డ్రోన్ కొనుగోలుపై గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. మొదటి విడతలో 2 డ్రోన్లు మంజూరు చేయనున్నారు. రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు, మహిళా సంఘాలు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు.