విశాఖ: తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన అల్లూరి మణికుమారి(58) విశాఖ సిరిపురంలో గల తన కుమార్తె శిరీష నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. సమాచారం అందుకున్న 3 టౌన్ ఎస్సై చిన్నం నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.