Corona : కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు(Corona) మరోసారి విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ దాటికి ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు కొన్ని వేలసంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండడం తో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. తాజాగా విజయనగరం జిల్లా ఏకలవ్య పాఠశాల(Ekalavya School)లో 14 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం జిల్లా(Vizianagaram District) మక్కువ మండలంలోని ఐటీడీఏ పీవో(ITDA PO) పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థులు అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్(Positive)గా తేలింది. వారితో సన్నిహితంగా ఉన్నారన్న అనుమానంతో మరికొంతమందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 14 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం వీరిని అధికారులు ఐసోలేషన్(Isolation) లో ఉంచారు అధికారులు.
కాగా.. ఇండియా లో గత 24 గంటల్లో 11,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 66,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇటీవల రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) కి కరోనా పాజిటీవ్ గా నిర్థారణ అయింది. వైద్యుల బృందం రాజ్ నాథ్ సింగ్ ను పరీక్షించి, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia)కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.