పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘OG’ మూవీని పైరసీ చేస్తామంటూ నెట్టింట హెచ్చరికలు వస్తున్నాయి. ‘బప్పమ్ టీవీ’ (IBOMMA) అనే పైరసీ వెబ్సైట్ ‘OG కమింగ్ సూన్’ అనే పోస్టర్ను షేర్ చేసింది. ప్రముఖ హీరోల సినిమాను కూడా లీక్ చేస్తామంటూ హెచ్చరికలు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆ పోస్టర్ను ‘బప్పమ్ టీవీ’ వెంటనే డిలీట్ చేసింది.