మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన సినిమా ‘మాస్ జాతర’. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.